Advertisement
Google Ads BL

నాని వదులుకున్న క్రేజీ ప్రాజెక్ట్స్


నేచురల్ స్టార్ నాని మంచి రేజింగ్ లో ఉన్నాడు. దసరా, సరిపోదా శనివారం చిత్రాలతో పాన్ ఇండియా కలను నెరవేర్చుకోలేని హీరో నాని ఈసారి ప్యారడైజ్ తో గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్యారడైజ్ నుంచి వస్తున్న కంటెంట్ పాన్ ఇండియా  ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది.

Advertisement
CJ Advs

అనిరుద్ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి వచ్చిన ఆయా షేర్ సాంగ్ సోషల్ మీడియాను దుల్లగొట్టేస్తుంది. అయితే నాని ఈ ప్యారడైజ్ కారణం క్రేజీ ప్రాజెక్ట్స్ ని వదులుకున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాని ప్యారడైజ్ డేట్స్ కారణంగా నాని తో చెయ్యాలనుకున్న దర్శకులు వేరే హీరోలకి షిఫ్ట్ అయ్యారట.

అందులో నాని తో హాయ్ నాన్న చేసిన శౌర్యువ్ నాని తో మరో మూవీ ప్లాన్ చేసుకొగా.. అది ప్యారడైజ్ వల్ల లేట్ అవడంతో.. ఆ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండకు షిఫ్ట్ అవ్వగా, ఆతర్వాత సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు. మరో జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ నాని కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్‌ను, నాని డేట్స్ లేట్ అవుతూ ఉండడంతో.. ఇప్పుడు టీజే జ్ఞానవేల్ దానిని సూర్యతో పట్టాలెక్కిస్తున్నారు అని తెలుస్తుంది.

సో ఒక్క ప్యారడైజ్ వల్లే నాని మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ని వదులుకోవాల్సి వచ్చిందట. ప్యారడైజ్ తదుపరి చిత్రం సుజిత్ దర్శకత్వంలో నాని బ్లడీ రోమియో చెయ్యబోతున్నాడు.

Hero Nani Loses Three Crazy Projects:

Nani losing prestigious projects
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs