పాన్ ఇండియా మూవీస్ అన్ని ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. పెద్ది ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ అయ్యి జూన్ కి వెళ్ళిపోయింది. జూన్ లో ప్రోపర్ డేట్ ఇవ్వకపోయినా జూన్ 4 న పెద్ది రాక ఖాయమైనట్టే. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న ఫౌజీ రిలీజ్ డేట్ కూడా ఇవ్వకుండా మేకర్స్ కన్ఫ్యూజన్ లో పెట్టారు.
ముందు ఆగస్టు అన్నారు, తర్వాత దసరా అన్నారు. కానీ దసరా కి డేట్ లాక్ చెయ్యలేదు. రీసెంట్ గా దసరా కు ఫౌజీ రిలీజ్ ఉండదు.. డిసెంబర్ కి వెళ్ళిపోయింది అనే న్యూస్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలైపోయినా.. ఫౌజీ మేకర్స్ ఈ రూమర్స్ ని ఖండించలేదు సరికదా.. దసరా ఫిక్స్ అని చెప్పనూ లేదు.
హను రాఘవుడి డైరెక్షన్ లో ప్రభాస్ సోల్జర్ గా కనిపిస్తున్న ఈచిత్రం పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తుంది. ఫౌజీ ఫస్ట్ లూమ్ తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. మరి ఆ రిలీజ్ డేట్ కూడా ఇస్తే ఫ్యాన్స్ రిలాక్స్ అవుతారు.