Advertisement
Google Ads BL

కల్కి 2 కోసం క్రేజీ టైటిల్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఒకపక్క ఫౌజీ, మరోపక్క సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లతో పాటుగా హిట్ సీక్వెల్ కల్కి 2 సెట్స్ పైకి వచ్చేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2 చిత్రాన్ని అఫీషియల్ గా పట్టాలెక్కించడమే కాదు ప్రభాస్ లేని సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. 

Advertisement
CJ Advs

హైదరాబాద్ నగర శివార్లలోని కల్కి 2 కోసం వేసిన భారీ సెట్ నిర్మాణం కోసమే మేకర్స్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కల్కి 2 ఇంటర్వెల్ ఎపిసోడ్ ని ఈ సెట్ లో చిత్రీకరిస్తారని.. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ ఇలా కీలక పాత్రలతో గూస్ బంప్స్ తెప్పించే ఇంటర్వెల్ ఎపిసోడ్ ని నాగ్ అశ్విన్ ప్లాన్ చేసారని అంటున్నారు.

కల్కి పార్ట్ 1 కి కల్కి 2898 AD టైటిల్ పెట్టిన నాగ్ అశ్విన్ కల్కి 2 కోసం మరో ప్రత్యేకమైన టైటిల్ ని వెతికారని టాక్. కర్ణ 3102 BC అంటూ కల్కి సీక్వెల్ కి పవర్ ఫుల్ టైటిల్ పెడుతున్నారని తెలుస్తుంది. మొదటి భాగం చివరలో ప్రభాస్ పాత్ర కర్ణుడిగా రివీల్ అయినప్పుడు థియేటర్లలో చప్పట్లు, కేకలతో మారుమోగిపోయింది. 

సెకండ్ పార్ట్ లో ఆ కర్ణుడికి సంబందించిన యాక్షన్ ఎపిసోడ్స్ ని హైలెట్ చేస్తూ అందుకు తగ్గట్టుగా ఈ టైటిల్ ని అనుకుంటున్నారట. కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలు, కలియుగ ప్రారంభం సమయంలో అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కల్కి పార్ట్ 2 లో కూలంకషంగా చూపిస్తారని సమాచారం. 

Crazy title for Kalki 2:

Kalki 2 Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs