Advertisement
Google Ads BL

వర్మ నే తప్పుబట్టిన చంద్రబాబు


పిఠాపురంలో జనసేన ఆధిపత్యాన్ని భరించలేక అప్పుడప్పుడు అడ్డం తిరిగి కూటమి ప్రభుత్వ స్నేహాన్ని రచ్చ కీడుస్తున్న పిఠాపురం SVSN వర్మ తీరు ని అధిష్టానం తప్పుబడుతుంది. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటుని త్యాగం చేసిన వర్మ కు పార్టీ ఎమ్యెల్సీ ఇస్తుంది అనుకుంటే అది కూడా నాగబాబు కి ఇవ్వడం, ఇంకా పిఠాపురం పార్టీ కార్యకలాపాల్లో, జనసేన ఆధిపత్యం ఇవన్నీ వర్మ కి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

Advertisement
CJ Advs

అందుకే పిఠాపురం వర్మ అవకాశం వచ్చినప్పుడల్లా జనసేన పై విరుచుకుపడుతున్నారు. గతంలో ప్రభుత్వ ఆఫీస్ ల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేదు అని గొడవపడిన వర్మ ఈసారి ఫ్లెక్సీ వ్యవహారంలో రచ్చ చేసారు. పిఠాపురం నియోజకవర్గంలో ఫ్లెక్సీ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేదని, కానీ డిప్యూటీ సీఎం పవన్ ఫోటో ఉండడం పై ప్రోటో కాల్ వివాదానికి తెర లేపారు వర్మ.

ఈ వివాదంలో చంద్రబాబు వర్మనే తప్పుబట్టినట్టుగా తెలుస్తుంది. ఫ్లెక్సీ పై ఉన్నది జనసేన నేత మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా, పొత్తు లో ఉన్నప్పుడు ఇలాంటి వివాదాలు వలన ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి, వర్మ కాస్త తగ్గి ఉండాలని చంద్రబాబు హెచ్చరించడమే కాదు.. టీడీపీ ఇంచార్జ్ పల్లా తో చంద్రబాబు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. 

వర్మకు, జనసేన నేత దొరబాబుకు మధ్య ఉన్న పాత రాజకీయ శత్రుత్వమే ఈ గొడవకు ఆజ్యం పోసిందని అధిష్టానం గుర్తించి వర్మ నే సర్దుకుపోవాలి చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి వర్మ ఈ విషయమై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. 

Chandrababu Naidu serious on SVSN Varma:

Chandrababu Naidu fires on SVSN Varma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs