ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజీ హీరోగా మారాడు. పుష్ప సీరీస్ తో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఇప్పడు కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో రాకా తో పాన్ వరల్డ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. రాకా షూటింగ్ కోసం ముంబై టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తున్న అల్లు అర్జున్ ఈమధ్యన ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడనే ప్రచారం జరిగింది.
ఆ పుకార్లను అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కొట్టిపారేయగా ఇప్పుడు అల్లు అర్జున్ ఆధునిక హంగులతో హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్ లో కడుతున్న డ్రీమ్ మెన్షన్ గురించిన వార్తలు సోషల్ మీడియాలోనే కాదు బాలీవుడ్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఈ లగ్జరీ హౌస్ సుమారు 4 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారట.
అధునాతన సదుపాయాలు, ప్రీమియం ఇంటీరియర్స్, ప్రత్యేక డిజైన్‌లతో ఈ ఇంటిని స్టైలిష్ గా తీర్చిదిద్దుతున్నారు. అల్లు అర్జున్ తన డ్రీమ్ హౌస్ కోసం దాదాపు రూ.80 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇంటి నిర్మాణం చివరి దశకు చేరుకోగా, ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది మొదట్లో కానీ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది.