Advertisement
Google Ads BL

జెన్‌జెడ్ స్టార్ల‌కు ర‌జ‌నీ నేర్పిన పాఠం


ఈరోజుల్లో స్టార్ హీరోలు లేదా పాన్ ఇండియా హీరోలు వంద‌ల కోట్ల పారితోషికాల్ని కోట్ చేస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఒకప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద 100కోట్లు అయినా వ‌సూలు చేయ‌లేని ప‌రిస్థితి ఉండేది. అందుకు భిన్నంగా ఇప్పుడు 500కోట్లు అంత‌కుమించి బ‌డ్జెట్ల‌తో నిర్మిస్తున్న పాన్ ఇండియ‌న్ సినిమాలు దేశ‌విదేశాల‌లో భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తూ 1000 కోట్ల క్ల‌బ్ ల‌ను అందుకుంటున్నాయి.

Advertisement
CJ Advs

ఈ స‌మ‌యంలో టాలీవుడ్ స్టార్ హీరోలు త‌మ పారితోషికాల విష‌యంలో ఫార్మాట్ ని మార్చార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కొంత‌మంది స్టార్ హీరోలు ప‌రిమితంగా రెమ్యున‌రేష‌న్ ముందు వ‌సూలు చేసి, సినిమా రిలీజ‌య్యాక లాభాల్లో వాటాలు అందుకుంటున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.  మెగాస్టార్ చిరంజీవి, మ‌హేష్, ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఈ ప‌ద్ధ‌తిలో ప్యాకేజీలు తీసుకుంటున్నార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. వీరంద‌రితో పోలిస్తే ర‌జ‌నీ ఫార్మాట్ వేరుగా ఉంది.

అయితే అందుకు భిన్నంగా కేవ‌లం ఒక రూపాయి పారితోషికం తీసుకుని సినిమా రిలీజ‌య్యాక కేవ‌లం లాభాల్లో వాటా తీసుకునే హీరోలు కూడా ఉన్నారా? అంటే.. తాజా స‌మాచారం మేర‌కు.. తమిళ సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్ రజనీకాంత్ పారితోషికం.. నిర్మాతల విష‌యంలో ఆయనకున్న నిబద్ధత గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ నిర్మాత జి. ధనంజయన్ వివ‌రాల ప్ర‌కారం.. ర‌జ‌నీకాంత్ కేవ‌లం రూపాయి పారితోషికం తీసుకుని లాభాల్లో వాటా ప్రాతిప‌దిక‌న ప‌ని చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. 

ర‌జ‌నీ నిర్మాత‌ల ప‌క్ష‌పాతి అని తెలిపారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని అనుస‌రిస్తూ ఇప్పుడు అట్లీతో సినిమా కోసం అల్లు అర్జున్ కూడా అదే ప్రాతిప‌దిక‌న పారితోషికం తీసుకుంటున్నాడ‌ని.. నిర్మాత‌ల‌కు భారం కాకుండా ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి...

Rajinikanth lesson to Gen Z stars:

Superstar Rajinikanth lessons to Gen Z stars
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs