యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం షూటింగ్ సాగుతూ ఉంది. మేకర్స్ #NTRNeel అప్ డేట్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుంటే అభిమానులకు మంటెక్కిపోతుంది. గత రెండు నెలలుగా మే 20 కి ఎన్టీఆర్ బర్త్ డే కి పవర్ ఫుల్ అప్ డేట్స్ వదులుతారని అంటున్నారు.
తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే కి వదలబోయే రెండు సర్ ప్రైజ్ లను ప్రశాంత్ నీల్ సిద్ధం చేస్తున్నరంటూ మేకర్స్ క్రేజీ అప్ డేట్ వదిలారు, ఇప్పటికే #NTRNeel మూవీ గ్లింప్స్ లాక్ అయ్యాయి అని, దానితో పాటుగా కొత్త రిలీజ్ తేదీ ని అనౌన్స్ చేశారు. సో నీల్ ఈసారి ఎన్టీఆర్ బర్త్ డే కి పవర్ ఫుల్ గ్లింప్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారన్నమాట.
అందులో ఇప్పటికే #NTRNeel మూవీ ని జూన్ 11 న 2027 న రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ లాక్ చేసి ప్రీ లుక్ పోస్టర్ తో ప్రకటించారు. మే 20 న #NTRNeel గ్లింప్స్ రిలీజ్ అంటూ ఆ పోస్టర్ తోనే మేకర్స్ ఇచ్చిన సింపుల్ అప్ డేట్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ నీడలాంటి ఓ లుక్‌లో కనిపిస్తున్నారు. దీంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి.