నారి నారి నడుమ మురారి తో ఈ ఏడాది సంక్రాంతికి చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ మూడు నెలలు తిరిగేసరి బైకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. తండ్రి-కొడుకుల మద్యన సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన బైకర్ కి క్రిటిక్స్ పాస్ మార్కులు వేసినా ఆడియన్స్ మాత్రం బాగానే ఆదరించారు.
థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ తోనే రూ.40 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారీ ప్రమోషన్స్ తో బైకర్ ని శర్వానంద్ ఓన్ చేసుకున్నాడు. ఏప్రిల్ 3న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూసేలా ప్రమోషనల్ ఈవెంట్స్ లో రాజశేఖర్, శర్వా లు చెప్పుకొచ్చారు.
తాజాగా ఈ చిత్రం ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. బైకర్ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఈ చిత్రాన్ని మే 1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తుంది.