Advertisement
Google Ads BL

మోహన్ లాల్ కోసం బాలయ్య వెయిటింగ్


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 ప్రాజెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ నగర శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జెసిబి ఫైట్ చిత్రీకరించారు. అయితే బాలయ్య అటు గోపీచంద్ మలినేని మూవీ తో పాటుగా వివేక్ ఆత్రేయ సినిమా, అలాగే నాంది ఫేమ్ విజయ్ కనకమేడల తో సినిమాలకు కమిట్ అయ్యారు.

Advertisement
CJ Advs

వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల ఇద్దరికి బాలయ్య తో మొదటి స్టార్ ప్రాజెక్ట్. అందుకే ప్రీ ప్రొడక్షన్ పనులతో ఇద్దరు డైరెక్టర్స్ కేర్ తీసుకుంటున్నారు. వివేక్ ఆత్రేయ - బాలయ్య సినిమా మొదలు కావాలంటే ఈసినిమాలో నటించే మరో స్టార్ మోహన్ లాల్ డేట్స్ కావాల్సి ఉన్నాయట. 

మోహన్ లాల్ ని ఈప్రాజెక్టు లోకి తెచ్చేందుకు వివేక్ ఆత్రేయ ఫిక్స్ అయినా.. మోహన్ లాల్ కి రెండు మూడు ప్రాజెక్ట్స్ కమిట్మెంట్స్ ఉండడంతో ఆయన ఇప్పుడప్పుడే బాలయ్య ప్రాజెక్ట్ కి డేట్స్ ఇచ్చే అవకాశం లేదు అని తెలుస్తుంది. సో వివేక్ ఆత్రేయ-బాలయ్య ప్రాజెక్ట్ మొదలు కావాలంటే మోహన్ లాల్ ఫ్రీ అవ్వాలన్నమాట. 

Balayya waiting for Mohanlal:

Balakrishna-Vivek Athreya Film On Hold
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs