Advertisement
Google Ads BL

దక్షిణాది సినీ నిర్మాతల ఐక్య గర్జన


దక్షిణాది సినీ పరిశ్రమలో కీలక మార్పులకు వేదికగా హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లా నిలిచింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమై.. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి `సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్` (SIFPA) అనే నూతన సంస్థను ఏర్పాటు చేశారు. 

Advertisement
CJ Advs

ప్రధానంగా థియేట్రికల్ నిబంధనలు, 8 వారాల ఓటీటీ విండో గడువుపై ఇతర భాగస్వాములు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను ఈ సందర్భంగా నిర్మాతలు తీవ్రంగా ఖండించారు. ఈ కొత్త అసోసియేషన్‌ను పర్యవేక్షించడానికి నాలుగు భాషా పరిశ్రమల ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని కూడా నియమించారు. ఇది నిర్మాతలకు నిర్ణయాధికారాల్లో సర్వాధికారాలు ఉండేలా చూస్తుంది.

ఈ చారిత్రాత్మక భేటీలో నిర్మాతలందరికీ SIFPA పలు కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా ఓటీటీ విడుదల గడువుకు సంబంధించి ఎటువంటి `లెటర్ ఆఫ్ కమిట్‌మెంట్` ఇతర రంగాలకు ఇవ్వవద్దని..ఆర్థిక లాభనష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ప్రస్తుత చిత్ర నిర్మాణ ప్రక్రియలు, హక్కుల విక్రయాలు ఎవరి ఒత్తిడి లేకుండా యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేసింది. 

టాలీవుడ్ (TFPC, ATFPG), కోలీవుడ్ (TFAPA), మాలీవుడ్, శాండల్‌వుడ్ (KFPA) అసోసియేషన్ల మద్దతుతో ఏర్పడిన ఈ వ్యవస్థ దక్షిణాది సినీ పర్యావరణ వ్యవస్థను.. దానిపై ఆధారపడిన వేలాది మంది జీవనోపాధిని కాపాడటంలో కీలక పాత్ర పోషించబోతోంది.

South Indian film producers Crucial Meeting Held:

Formation of South Indian Film Producers Association
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs