Advertisement
Google Ads BL

మాజీ సీఎం మనవరాలి సినీప్రవేశం


రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మనవరాలు సంస్కృతి జయనా విలక్షణమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఆమె త్వరలో విడుదల కానున్న పౌరాణిక చిత్రం `కృష్ణావతారం పార్ట్-1: ది హార్ట్` ద్వారా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

సాధారణ వాణిజ్య చిత్రాలతో కాకుండా ఆధ్యాత్మికత- భక్తితో కూడిన ఈ పౌరాణిక గాథలో శ్రీకృష్ణుని ప్రియురాలు సత్యభామ పాత్రను పోషిస్తున్నారు. హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 7న విడుదల కానుంది. సిద్ధార్థ్ గుప్తా కృష్ణుడిగా, సుస్మితా భట్ రాధగా, నివాసిని కృష్ణన్ రుక్మిణిగా నటిస్తున్న ఈ సినిమా మొత్తం సత్యభామ దృక్కోణం నుండే సాగుతుండటం విశేషం.

సంస్కృతి జయనా కేవలం నటి మాత్రమే కాదు.. పారిశ్రామికవేత్తగాను రాణిస్తున్నారు. లండన్ , అమెరికాలోని ప్రతిష్టాత్మక సంస్థలలో నటన, నృత్యం, ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొంది 16 ఏళ్ల వయసులోనే తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించారు. అధికారిక వాతావరణంలో పెరిగినా చిన్నతనం నుండి తన తల్లిదండ్రులతో కలిసి సామాజిక సేవలో పాలుపంచుకున్న సంస్కృతి.. భారతీయ హస్తకళల పరిరక్షణలోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ భామ‌ నటనతో సత్యభామ పాత్రకు ఏ మేరకు ప్రాణప్రతిష్ట చేశారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Former CM granddaughter makes film debut:

Gujarat Former CM granddaughter makes film debut
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs