పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నిన్న శనివారం సాయంత్రం అపోలో ఆసుపత్రిలో చిన్న సర్జరీ జరిగింది. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో అపోలో వైద్యులు పవన్ కళ్యాణ్ కి సైనస్ సర్జరీ చేసారు. దానితో కొద్దిరోజులు పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.
అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం విషయంలో పీఎం మోడీ దగ్గరనుంచి సీఎం చంద్రబాబు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ అంతా ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లు వేశారు. తాజాగా మెగాస్టార్ చిరు తన తమ్ముడు కళ్యాణ్ బాబు హెల్త్ పై అప్ డేట్ ఇచ్చారు.
కళ్యాణ్ బాబుకు విజయవంతంగా సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా, నిలకడగా ఉంటూ బాగా కోలుకుంటున్నారు.
వైద్యుల చెప్పిన ప్రకారం, ఆయన తన సాధారణ దినచర్యకు తిరిగి రావడానికి సుమారు ఒక వారం పట్టవచ్చు. కళ్యాణ్ బాబు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మీ అందరి ప్రేమకు, ఆందోళనకు, ప్రార్థనలకు ధన్యవాదాలు. మనమందరం ఆయనను మన ఆలోచనలలో ఉంచుకుని, ఆయనకు మనోధైర్యం, ఓదార్పు లభించాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.. అంటూ ట్వీట్ చేసారు.