Advertisement
Google Ads BL

చియాన్ ప్రమాదకరమైన వంటవాడు


చియాన్ విక్రమ్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుకను అందించారు. అత‌డు న‌టిస్తున్న‌ తదుపరి చిత్రం `చియాన్ 63`కి సంబంధించి `ఫస్ట్ ఫ్లేమ్` పేరుతో ఒక టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఇరుముగన్ సూపర్ హిట్ కావడంతో ఈ రెండో ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ టీజర్‌లో విక్రమ్ ఒక ప్రమాదకరమైన వంటవాడి  పాత్రలో కనిపిస్తున్నారు. గొడౌన్ లోపల భారీ వంట పాత్రల మధ్య కూర్చుని.. బయట గ్రెనేడ్లు పేలుతున్నా ఎంతో ధీమాగా సిగరెట్ వెలిగిస్తూ విక్రమ్ చూపించిన మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Advertisement
CJ Advs

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీజర్‌లో వచ్చే ``అతను కేవలం వంటవాడే కానీ చాలా ప్రమాదకరం`` అనే వాయిస్ ఓవర్ సినిమా ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. చియాన్ 63 చిత్రీకరణ 2026 మే నెలలో ప్రారంభం కానుంది. 

విక్రమ్ గతంలో నటించిన `వీర ధీర సూరన్: పార్ట్ 2` తర్వాత వస్తున్న ఈ చిత్రం అత‌డి మాస్ ఇమేజ్‌ను పాన్ ఇండియా స్థాయిలో మరో మెట్టు ఎక్కించేలా కనిపిస్తోంది. ``వంట ఇప్పుడే మొదలైంది`` అనే ముగింపు వాక్యం సినిమాలో విక్రమ్ ఎలా విధ్వంశ‌క‌రంగా మార‌తాడో ఆవిష్క‌రిస్తోంది.  

 

Vikram 63 update:

Vikram 63 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs