Advertisement
Google Ads BL

తమిళనాడు ప్రచారానికి చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు NDA మిత్రత్వం కోసం తమిళనాడు వెళ్ళబోతున్నారు. అక్కడ ఏప్రిల్ 23 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు ప్రచారం చెయ్యబోతున్నారు. దాని కోసం చంద్రబాబు రేపు తమిళనాడు వెళ్ళబోతున్నారు. రెండు రోజుల పాటు అంటే సోమ, మంగళవారాల్లో ఆయన తమిళనాడులో సుడిగాలి పర్యటన చేయనున్నారు. 

Advertisement
CJ Advs

తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వారు అత్యధికంగా నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన NDA కూటమి, చంద్రబాబు చరిష్మాతో ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని బాబు గారితో ప్రచారం చేయిస్తుంది. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే , టీవీకే పార్టీల నడుమ పోరు జరగబోతుంది.

చంద్రబాబు కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి వంటి ప్రాంతాల్లో రోడ్ షో లు, ర్యాలీ లు, సభలు నిర్వహించనున్నారు. ఎలాగైనా తమిళనాట పాగా వెయ్యాలని NDA కూటమి ఈసారి పక్కా వ్యహాలు రచించి తమతో మిత్రత్వం కలిగిన బలమైన నాయకులతో ప్రచారం చేయించాలని ఇలా ప్లాన్ చేసారు. మరి చంద్రబాబు ప్రచారం NDA కూటమి ఎంత హెల్ప్ అవుతుందో చూడాలి. 

CBN to participate in Tamil Nadu election campaign:

CM Chandrababu to participate in Tamil Nadu election campaign
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs