Advertisement
Google Ads BL

రావ‌ణుడి గెటప్‌పై విమ‌ర్శ‌ల‌కు ఆన్స‌ర్


నితీష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం`లో అసుర చక్రవర్తి రావణుడి పాత్రను గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఆవిష్కరిస్తున్నారు. ఈ పాత్రను పోషిస్తున్న నటుడు యశ్ .. నిర్మాత నమిత్ మల్హోత్రా అభిప్రాయం ప్రకారం, రావణుడిని కేవలం ఒక మూస పద్ధతిలోని విలన్‌గా కాకుండా.. పాశ్చాత్య ప్రేక్షకులకు కూడా సులభంగా అర్థమయ్యేలా ఒక `రిలేటబుల్` మానవీయ కోణంలో చూపిస్తున్నార‌ని స‌మాచారం. ముఖ్యంగా అసురుల వేషధారణపై వస్తున్న విమర్శల గురించి తాజా ఇంట‌ర్వ్యూలో యశ్ మాట్లాడారు. 

Advertisement
CJ Advs

అంతర్జాతీయ స్థాయిలో లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గ్లాడియేటర్ వంటి చిత్రాలను ఆస్వాధించే గ్లోబల్ ఆడియెన్స్ ఈ పాత్రలకు కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే, రామాయ‌ణంలో పాత్ర‌ల‌ ఆహార్యంలో పాశ్చాత్య శైలిని జోడించినట్లు స్పష్టం చేశారు.

య‌ష్, న‌మిత్ వంటి ప్రముఖులు చెబుతున్న దానిని బ‌ట్టి రామాయ‌ణం చిత్ర‌ నిర్మాణంలో `తూర్పు - పడమరల` కలయిక స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ మూలాలకు హాలీవుడ్ స్థాయి మేకింగ్ విలువలని జోడించి అసురుల లోకాన్ని ఒక భారీ ఫాంటసీ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. ప్రఖ్యాత డిఎన్ ఇజి సంస్థ అందిస్తున్న ఫోటోరియలిస్టిక్ విజువల్స్ ద్వారా అసురుల గెటప్‌లు.. వారి సామ్రాజ్యం గతంలో ఎన్నడూ చూడని రీతిలో గంభీరంగా ఉండబోతున్నాయి. 

కేవలం ఒక ప్రాంతానికో లేదా భాషకో పరిమితం కాకుండా.. ప్రపంచవ్యాప్త ఎగ్జిబిటర్లను మెప్పించేలా ఈ అసుర పాత్రల చిత్రణలో మార్పులు చేయడం ఒక సాహసోపేతమైన నిర్ణయమని చిత్ర బృందం నమ్ముతోంది. నేటితరం ప్రపంచ ప్రేక్షకులకు మన ఇతిహాసాన్ని వారి అభిరుచులకు తగ్గట్టుగా అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం జరుగుతోంది.

Answer to criticism on Ravana getup:

Ramayana - Yash reveals Ravana costume was HEAVY
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs