Advertisement
Google Ads BL

కుమార్తె కోసం వ‌రుడి వేట‌లో క‌మ‌ల్ హాస‌న్


నటిగా, సింగర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా శ్రుతి హాసన్ ఎలాంటి విజ‌యాలు సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం ప్రోఫెష‌న‌ల్  కెరీర్ స్లోగా ఉన్నా?  అమ్మ‌డి ఇమేజ్ మాత్రం ఎక్క‌డా కింగ లేదు. తాజాగా శ్రుతిహాస‌న్ వివాహ వార్త తెర‌పైకి వ‌చ్చింది. లెజెండరీ నటుడు కమల్ హాసన్ గారాల పట్టి కోసం స్వయంగా తానే  వరుడిని వెతికే పనిలో పడ్డారని కోలీవుడ్ మీడియా కథనాలు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
CJ Advs

దీనిలో భాగంగా క‌మ‌ల్ త‌న‌కు తెలిసిన స‌న్నిహితులు, బందువుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారుట‌. బ‌య‌ట కుర్రాడు కంటే కుటుంబంలో స‌భ్యుడు అయితేనే బాగుంటుంద‌ని క‌మ‌ల్ ఈ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.  గతంలో శ్రుతి హాస‌న్ విదేశీయుడు మైఖేల్ కోర్సలే, ముంబైకి చెందిన శంతను హజారికాతో ప్రేమాయణాలు నెరిపిన సంగ‌తి తెలిసిందే.

కానీ  ఆ రెండు కూడా పెళ్లి వ‌ర‌కూ దారి తీయ‌లేదు. దీంతో ఈసారి పెళ్లి కోడుకు బాధ్య‌త‌లు క‌మ‌ల్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం శ్రుతి హాస‌న్ వ‌య‌సు  40 ఏళ్లు. పెళ్లికిక ఎంత మాత్రం ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని క‌మ‌ల్ భావిస్తున్నారుట‌. క‌మ‌ల్ హాస‌న్ వివాహ బంధం విషయంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో  కమల్ హాసన్  కుమార్తె విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  పిల్ల‌ల‌కు స్వేచ్ఛ‌నివ్వడంలో క‌మ‌ల్ ముందుంటారు. కానీ గత అనుభవాల దృష్ట్యా ఈసారి  స్థిరమైన సంబంధం కోసం క‌మ‌ల్  అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే బయట వ్యక్తుల కంటే  తెలిసిన స్నేహితులు లేదా బంధువుల సర్కిల్‌లోనే శ్రుతికి తగ్గ జోడిని ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  

Kamal Haasan In search Of Son In Law:

Kamal Haasan busy in search of suitable groom for Shruti Hassan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs