నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్లాప్ ల పరంపర కు జైలర్ చిత్రంతో అడ్డుకట్ట వేశారు. జైలర్ చిత్రం తో సూపర్ స్టార్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆతర్వాత అదే క్రేజ్ తో చాలా సినిమాలు చేసి డిజప్పాయింట్ చేసినా మంచి ఓపెనింగ్స్ రాబట్టారు రజినీకాంత్. ఇప్పుడు జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 రాబోతుంది.
మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లు క్యామియోలుగా జైలర్ వస్తే.. ఈ జైలర్ 2 లో మరో స్టార్ కామియో ఉండబోతుంది అనే న్యూస్, అందుకు సంబంధించి పలువురు క్రేజీ హీరోల పేర్లు వినిపించడంతో.. జైలర్ 2 పై భీభత్సమైన అంచనాలు పెరిగాయి. అందుకే జైలర్ 2 ఓటీటీ హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది.
జైలర్ 2 ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ ఏకంగా రూ.160 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. జైలర్ 2 నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఎప్పటినుంచో అమేజాన్ వాళ్లతో డిజిటల్ డీల్ గురించి సంప్రదింపులు జరుపుతూ ఫైనల్ గా రూ.160 కోట్లకు బేరాన్ని తెగ్గొట్టినట్లుగా టాక్ వినిపిస్తుంది.
గతంలో సూపర్ స్టార్ జైలర్ మూవీని అమెజాన్ ప్రైమ్ రూ.75 కోట్లకు తీసుకోగా.. ఆ చిత్రంతో అమెజాన్ ప్రైమ్ భారీగా లాభపడడంతోనే జైలర్ 2 కోసం ఈ రేంజ్ రేటు తెగ్గొట్టినట్టుగా తెలుస్తుంది.