వారణాసి చిత్రానికి సంబందించి సాంగ్ షూట్ చేస్తున్నారు రాజమౌళి. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఈ పాట ను సూపర్ స్టార్ మహేష్-ప్రియాంక చోప్రా లపై కూల్ డ్యూయెట్ ని రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కు బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫి అందిస్తున్నారు. హైదరాబాద్ ఎండ ప్రస్తుతం 41 నుంచి 42 డిగ్రీలలో ఉంటుంది. మండుటెండలో ఈ పాటను స్పెషల్ సెట్ లో రాజమౌళి చిత్రీకరిస్తున్నారు.
ఇక ఈపాట చిత్రీకరణ పూర్తి కాగానే రాజమౌళి ఆయన ఫ్యామిలీతో సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ ట్రిప్ కి విదేశాలకు వెళ్లనున్నారు. మే మొత్తం సమ్మర్ ట్రిప్ వెకేషన్ ను ఎంజాయ్ చేసి తిరిగి జూన్ లోనే వారణాసి కొత్త షెడ్యూల్ లో జాయిన్ అవ్వనున్నారు.
సూపర్ స్టార్ మహేష్ ఈ చిత్రంలో శ్రీరాముడిగా, రుద్రగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.