Advertisement
Google Ads BL

బ్యాడ్ బాయ్ కి బ్యాడ్ రివ్యూస్


ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుని, అంతే సైలెంట్ గా థియేటర్స్ లో విడుదలైన బ్యాడ్ బాయ్ కార్తీక్ చిత్రానికి బ్యాడ్ రివ్యూస్ మాత్రమే వచ్చాయి. జీరో హైప్ తో విడుదలైన నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. నాగ శౌర్య నిర్మాత కోసం ఒకటి రెండు ప్రమోషనల్ ఈవెంట్స్ లో కనిపించినా సినిమాపై బజ్ క్రియేట్ అవ్వలేదు.

Advertisement
CJ Advs

బ్యాడ్ బాయ్ కార్తీక్ ప్రమోషన్స్ లో నాగ శౌర్య కనిపించినా ఆ చిత్రం ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు, దానితో సినిమాకి ఓపెనింగ్స్ లేకుండా పోయాయి. ట్రైలర్ చూస్తే ఎంతోకొంత వర్కౌట్ అవుతుంది అనుకుంటే సినిమా విడుదలయ్యాక కానీ దాని జాతకం బయటపడలేదు. బ్యాడ్ బాయ్ కార్తీక్ బోరింగ్ అంటూ క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు.

బ్యాడ్ బాయ్ కార్తీక్ థియేటర్స్ లో ప్రేక్షకులు పది శాతం కూడా కనిపించలేదు అంటే ఆ సినిమా విషయంలో ఎంత బజ్ ఉందొ అర్ధమవుతుంది. ఇక సినిమా ఫలితం ముందే తెలిసి నాగ శౌర్య ఇంటర్వూస్ కూడా ఇవ్వకుండా సైలెంట్ అయ్యాడేమో అనిపించకమానదు. 

అంతేకదా సినిమా బావుంది అని ఆడియన్స్ ని రాంగ్ ట్రాక్ ఎక్కించి తర్వాత తిట్లు తినే కన్నా కామ్ గా ఉంటేనే బెటర్.

Bad Boy Karthik :

Naga Shaurya - Bad Boy Karthik 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs