Advertisement
Google Ads BL

విజయ్ కింగ్ మేకర్ అవుతాడా


తమిళనాడులో ఈ అసెంబ్లీ ఎన్నికలు హోరా హోరీగా జరగబోతున్నాయి. డీఎంకే, ఏఐడీఎంకే నడుమ క్రేజీ ఫైట్ ఉంటుంది అనుకుంటే విజయ్ TVK పార్టీ అనూహ్యంగా పోటీ కి దిగింది. విజయ్ క్రేజు, కొత్త పార్టీ మోజుతో చాలామంది విజయ్ TVK పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. విజయ్ TVK కారణంగా డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల ఓటు బ్యాంకుకు చిల్లు పడుతున్నట్లే కనిపిస్తుంది.

Advertisement
CJ Advs

మరోపక్క విజయ్ మ్యానిఫెస్టో కి తమిళనాడు ప్రజలు ఆకర్షితులైతే ఇక అంతే. అయితే విజయ్ కి స్పష్టమైన మెజారిటీ అంటే పార్టీ పరంగా అధికారాన్ని చేపట్టే మెజారిటీ లేకపోయినా.. ఏదో ఒక పార్టీకి మద్దతు ఇచ్చే కెపాసిటీ అయితే రావడం పక్కా, అంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కింగ్ మేకర్ గా నిలవడం గ్యారెంటీ అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

విజయ్ పార్టీకి ఓటు బ్యాంకు పెరగడం, డీఎంకే వ్యతిరేక ఓటర్లు, మరోపక్క ఏఐడీఎంకేలో నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నవారు విజయ్ TVK పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. అటు డీఎంకే, ఏఐడీఎంకే కు స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు, దాని కోసం ఈ రెండు పార్టీల్లో ఎవ్వరైనా విజయ్ TVK సపోర్ట్ తీసుకోవాల్సిందే.. అక్కడే విజయ్ సగం గెలుస్తాడు అంటున్నారు. చూద్దాం విజయ్ TVK పార్టీ బలమేమిటో, బలహీనతలేమిటో అనేది. 

Will Vijay become a kingmaker:

TVK Vijay
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs