ఈమధ్యన ఓటీటీ డీల్ పూర్తయితేనే కానీ సినిమాలు విడుదల కావట్లేదు. ఒకవేళ ఓటీటీ డీల్ అవ్వకుండా రిలీజ్ చేస్తే, దానికి డివైడ్ టాక్ వస్తే ఇక ఆ సినిమని కొనేందుకు ఏ ఓటీటీ సంస్థ ముందుకు రాదు. అందుకే ముందే ఓటీటీ డీల్ పూర్తి చేసుకుని.. ఆ ఓటీటీ సంస్థ చెప్పిన రిలీజ్ డేట్ లనే మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు.
అందుకే దర్శకనిర్మాతలు ఓటీటీ డీల్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక దర్శకులు ఎవరైనా వరస ఫెయిల్యూర్స్ లో ఉంటే ఓటీటీ లు ఆచి తూచి తక్కువ ధరలకు డీల్ సెట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి దర్శకుడు పూరి జగన్నాధ్ వస్తున్నారు. వరస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాధ్ పూరి కనెక్ట్స్పై విజయ్ సేతుపతి హీరోగా స్లమ్‌డాగ్ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఆ చిత్రం షూటింగ్ ఫినిష్ అయ్యి చాలా కాలమే అయ్యింది. కానీ విడుదల తేదీ విషయంలో సస్పెన్స్ నెలకొంది. కారణం సరైన ఓటీటీ పార్ట్నర్ దొరకకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈ డీల్ ఖరారైన వెంటనే స్లమ్‌డాగ్ అధికారిక విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరి పూరిని నమ్మి ఏ ఓటీటీ సంస్థ స్లమ్‌డాగ్ డిజిటల్ హక్కులు కొంటుందో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఈ చిత్రంలో టబు, సంయుక్త కీలక పాత్రల్లో కనిపించనున్నారు.