Advertisement
Google Ads BL

ఎఫ్ఫైర్ రూమర్స్ పై కంగనా కౌంటర్


పెళ్లి వయసు దాటిపోయినా సింగిల్ స్టేటస్ మెయింటన్ చేసే సెలబ్రిటీస్ చుట్టూ ఎప్పుడు ఏదో ఒక ఎఫ్ఫైర్ రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. సెలబ్రిటీస్ అన్నాక ఇలాంటి వార్తలు సర్వసాధారణమే. అందులో కొంతమంది వాటిని ఖండిస్తారు. కొంతమంది మౌనం వహిస్తారు.

Advertisement
CJ Advs

ఈమధ్యన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనాపై ఓ సరికొత్త ఎఫ్ఫైర్ న్యూస్ నడుస్తుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ తో కంగనా రనౌత్ ఎఫ్ఫైర్ నడిపిస్తుంది. వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా లో గుసగుసలు వినిపిస్తుంది. దానికి కారణం లేకపోలేదు, పార్లమెంట్ సమావేశాల సమయంలో వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసిన వారు తెగ ఊహించేసుకుంటున్నారు.

తాజాగా తనపై వస్తున్న ఎఫ్ఫైర్ రూమర్స్ పై కంగనా సెటెరికల్ గా కౌంటర్ వేసింది. చిరాగ్ పాశ్వాన్ నాకు మంచి ఫ్రెండ్. చిరాగ్ పాశ్వాన్ ని చూసినప్పుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే కనిపిస్తాడు తప్ప, మా మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. నిజంగా మా మధ్య ప్రేమ ఉండి ఉంటే, ఈపాటికి మాకు పిల్లలు ఉండేవారు. మా పరిచయం ఇప్పటిది కాదు.. పదేళ్ల క్రితమే మేం కలిసి సినిమా చేశాం అంటూ కంగనా తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది. 

Kangana shuts down romance rumours:

Kangana Ranaut has clarified that there is no romance happening between Chirag Paswan and her
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs