కాంతార 2తో పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషన్ సృష్టించిన రుక్మిణి వసంత్ ఇప్పుడు మరో పాన్ ఇండియా ఫిల్మ్ టాక్సిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యష్ టాక్సిక్ జూన్ 4 న విడుదలవుతుంది. అంతేకాదు ఈ పాప పేరు అన్ని భాషల్లోనూ మోగిపోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ లోను రుక్మిణి నే హీరోయిన్.
ఈమధ్యన అవార్డు వేడుకల్లో అలాగే సినిమా ఈవెంట్ లో కనబడుతున్న రుక్మిణి గ్లామర్ గా అద్దరగొట్టేస్తుంది. తాజాగా ముంబై లో జరిగిన INCA అవార్డు వేడుకల్లో రుక్మిణి వసంత్ గ్లామర్ షో చూసి వావ్ బ్యూటిఫుల్ అంటూ పొగడకుండా ఉండలేకపోతున్నారు ఆమె అభిమానులు.
క్రీమ్ కలర్ మోడ్రెన్ డ్రెస్ లో రుక్మిణి వసంత్ లేటెస్ట్ లుక్ ఎన్టీఆర్ అభిమానుల మనసు దోచేసింది. ఎన్టీఆర్-రుక్మిణి కలయికలో వచ్చే అప్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. ఇది కాకుండా రుక్మిణి పేరు పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో వినిపిస్తుంది.