ఏప్రిల్ 30 నుంచి పెద్ది ని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించినా స్పష్టమైన విడుదల తేదీ ని ఇవ్వకుండా మళ్లీ అందరిని కన్ఫ్యూజన్ లో పడేసారు మేకర్స్.. జూన్ విడుదల అంటున్నారు తప్ప అధికారికంగా ప్రకటన లేదు. అటు జూన్ లో విడుదలవ్వాలనుకున్న సినిమాలపై పెద్ది భారం ఎవరిపై పడుతుందో తెలియడం లేదు.
పెద్ది కి రిలీజ్ డేట్ ఇచ్చేస్తే విశ్వంభర విడుదల తేదీ లాక్ చేద్దామని మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. జూన్ 4 అంటే యష్ టాక్సిక్ కి ఎఫెక్ట్ అవుతుంది, కాదు జూన్ 25 అంటే అఖిల్ లెనిన్ కి ప్రోబ్లేం. కారణం పెద్ది పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అందుకే పెద్ది భారం ఎవరిపై పడుతుందో అనేది.
పెద్ది ఎప్పుడు రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ గ్యారెంటీ, సో ఏ సినిమాపై పోటీ పడినా పెద్ది కి డ్యామేజ్ జరగదు కానీ.. వేరే సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది. మరి పెద్ది మేకర్స్ ఇప్పటికైనా పెద్ది లెక్క సరి చేస్తే సరి.