మార్చ్ 19 న ఉగాది రోజున గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ రావడం ఆడియన్స్ నే కాదు పవన్ ఫ్యాన్స్ ని కూడా డిజప్పాయింట్ చేసింది. పవన్ కళ్యాణ్ లుక్స్, ఆయన ఎలివేషన్ సీన్స్ మాత్రమే ఫ్యాన్స్ ని ఇంప్రెస్స్ చేసినా సినిమా రిజల్ట్ మాత్రం అభిమానులు నిరాశపరిచింది.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ వీకెండ్ కే చేతులెత్తేసింది. దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్స్ ఎంతగా సినిమాని లేపుదామనుకున్నా ధురంధర్ 2 వీరి ఆశలను అడియాసలు చేసింది. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఉస్తాద్ ని ఓటీటీ లో వీక్షించిన వారు మిక్స్డ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు.
ఇందులో పవన్ కళ్యాణ్ తప్ప మరేది చూడడానికి లేదు, హీరో ఎలివేషన్స్ తప్ప ఇంకేం లేదు, హరీష్ శంకర్ గొప్పగా చెప్పాడు, ఆయన డైరెక్షన్ స్కిల్స్ ఎక్కడ కనిపించాయి, డైలాగ్స్ ఎక్కడ పేలాయి అంటూ హరీష్ శంకర్ ని మరోమారు టార్గెట్ చేస్తున్నారు. కొంతమంది ఉస్తాద్ గురించి పాజిటివ్ గా రెస్పాన్డ్ అవుతుంటే, మరికొందరు ట్రోల్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.