Advertisement
Google Ads BL

వందల కోట్ల వ్యాపారం.. హీరోల మార్కెట్ రిస్క్!


స్టార్ హీరోల సినిమాల విషయంలో కథా చర్చల దశలోనే దర్శకులు మారడం అనేది పరిశ్రమలో ఓ సాధారణ ప్రక్రియ. దీనిని ప్రతికూలంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే షూటింగ్ సగం పూర్తయ్యాక లోపాలను గుర్తించి ప్రాజెక్ట్‌ను నిలిపివేయడం కంటే?  ముందే సరిదిద్దుకోవడం ఉత్తమమైన పద్ధతి. హీరో -దర్శకుడి మధ్య కథా గమనంపై పూర్తిస్థాయి ఏకాభిప్రాయం లేనప్పుడు బలవంతంగా ముందుకు వెళ్లడం వల్ల సినిమా ఫలితం దెబ్బతింటుంది. అందుకే స్క్రిప్ట్ పక్కాగా ఉండేలా చూసుకోవడం కోసం మేకర్స్ తీసుకునే ఇటువంటి కఠిన నిర్ణయాలు అంతిమంగా సినిమా నాణ్యతను పెంచడానికి తోడ్పడతాయి.

Advertisement
CJ Advs

స్క్రిప్ట్ విషయంలో స్టార్ హీరోలు ఇన్వాల్వ్ అవ్వడాన్ని కొందరు జోక్యం అని విమ‌ర్శించినా? ప్రస్తుత పరిస్థితుల్లో దానిని బాధ్యతగా కూడా చూడొచ్చు. నేడు ఒక పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైతే?  ఆ ప్రభావం దర్శకుడి కంటే హీరో మార్కెట్ , ఇమేజ్ పైనే ఎక్కువగా ఉంటుంది. వందల కోట్ల రూపాయల బడ్జెట్, వేలాది మంది అభిమానుల అంచనాలు హీరో చుట్టూనే తిరుగుతుంటాయి . కాబట్టి ప్రతి అంశం పర్ఫెక్ట్‌గా ఉండాలని వారు కోరుకుంటారు. అయితే ఈ క్రమంలో దర్శకుడి సృజనాత్మక స్వేచ్ఛకు ఆటంకం కలిగితే మాత్రం సినిమా సహజత్వం దెబ్బతినే ప్రమాదం  ఉంటుంది.

ప్రస్తుత పాన్-ఇండియా మార్కెట్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నప్పుడు నిర్మాతలు కూడా హీరో అభిప్రాయాలకే మొగ్గు చూపుతారు. కథలో కమర్షియల్ హంగులు లేదా నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేయడానికి దర్శకులు నిరాకరించినప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏర్పడి దర్శకులు తప్పుకుంటుంటారు. ఇది కేవలం సృజనాత్మక విభేదం మాత్రమే కాదు. వ్యాపారపరమైన భద్రతకు సంబంధించిన విషయం కూడా. హీరోలు కేవలం సూచనలు ఇచ్చే స్థాయిని దాటి కథను శాసించే స్థాయికి వెళ్లకుండా దర్శకుడితో సమన్వయంతో పనిచేసినప్పుడే  మంచి ఫ‌లితాల‌కు అవ‌కాశం ఉంటుంది.

 

Big Movies:

Business worth hundreds of crores.. Heroes market risk!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs