Advertisement
Google Ads BL

దీపిక కు కంగనా సపోర్ట్


బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే వర్కింగ్ అవర్స్ విషయంలో చేసిన కామెంట్స్ పై కొంతమంది దీపికా పదుకొనె ను సపోర్ట్ చేస్తే మరికొంతమంది ఆమె మాటలపై వేరేలా స్పందించారు. తాజాగా మరో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దీపికా పదుకొనె వర్కింగ్ అవర్స్ పై చేసిన కామెంట్స్ ని సమర్ధించింది. 

Advertisement
CJ Advs

పని వేళలపై అనవసర రాద్ధాంతం ఎందుకు. ప్రస్తుతం దీపిక పదుకొనె కి ఉన్న ఈస్థానం ఆమె ఎంతో కష్టపడితే కానీ రాలేదు. అంతేకాదు ఇప్పుడామె ఓ బిడ్డకు తల్లి. టాప్ హీరోయిన్. ఒకవేళ దీపికా తను ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తానని అంటే కచ్చితంగా ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు ఉంది.

ఒకప్పుడు 12 గంటలు సెట్ లోనే ఉంది పని చేసే వాళ్ళం. అప్పట్లో మేము సినిమా కోసం ఎన్ని గంటలైనా పనిచేసేవాళ్లం. చాలా ఉత్సహంగా ఉండేవాళ్లం. ఏదైనా చేయడానికి రెడీ అనే వాళ్లం. కాబట్టే మేము సక్సెస్ అయ్యాం. చాలామందికి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వారి స్థానమే కాదు వారి పాత్ర కూడా మారిపోయే అవకాశం ఉంది. దీపికా అలా కాదు, ఆమె స్తానం స్పెషల్. ఆమె ఓ బిడ్డకు తల్లి.

ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న దీపికా డిమాండ్ చెయ్యొచ్చు, ఎనిమిది గంటలే పని చేస్తానని చెప్పొచ్చు, అందుకు ఇష్టమైన వారే ఆమెను నటింపజేసుకుంటారు. అలా ఎందుకు చేయకూడదు అంటూ వర్కింగ్ అవర్స్ విషయంలో కంగనా దీపికా కు మద్దతుగా నిలిచింది. 

Kangana Ranaut supports Deepika Padukone:

Kangana Ranaut supports Deepika Padukone demand for an 8-hour work shift
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs