Advertisement
Google Ads BL

ఆ మిస్ట‌రీ గుట్టు విప్పేసిన ప‌వ‌న్ స‌తీమ‌ణి!


జనసేనాని పవన్ కల్యాణ్ భార్య  అన్నా లెజినోవా సోషల్ మీడియాలో తన గురించి కొన్నేళ్ల సాగుతోన్న ఓ పెద్ద అపోహకు తాజాగా తెరదించారు. పవన్ పక్కన ఒక విదేశీ మహిళ ఉన్న పాత ఫొటోను షేర్ చేస్తూ ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని ఆమె అధికారికంగా స్పష్టం చేశారు. `ఈ అందమైన మహిళ నేను కాదు` అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివరణ ఇచ్చారు. తన జీవితంలో తాను ఎప్పుడూ మోడల్‌గా కానీ, నటిగా కానీ పని చేయలేదన్నారు. దీంతో చాలాకాలంగా ఆమె గురించి నెటిజన్లలో ఉన్న కన్ఫ్యూజన్ తొల‌గిపోయింది.

Advertisement
CJ Advs

నిజానికి పవన్ పక్కన ఫొటోలో ఉన్న మహిళ పేరు డానా మార్క్స్. 2011లో విడుదలైన `తీన్ మార్` సినిమా ఆడియో వేడుక సందర్భంగా తీసిన ఫొటో అది. ఆ సినిమాలో మిచెల్ అనే పాత్రలో నటించిన డానా మార్క్స్ అమెరికాకు చెందిన  థియేటర్ ఆర్టిస్ట్. ప్రస్తుతం ఆమె అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో నటనలో శిక్షణ ఇస్తున్నారు. అన్నా లెజినోవా కూడా విదేశీ మహిళ కావడంతో? చాలామంది డానా మార్క్స్‌ను అన్నాగా పొరబడి ఆ ఫొటోను విపరీతంగా షేర్ చేసారు ఇంత‌కాల‌. అన్నా ఇచ్చిన తాజా వివరణతో ఆ ఫొటో వెనుక ఉన్న అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

పవన్ కల్యాణ్, అన్నా లెజినోవాల పరిచయం కూడా `తీన్ మార్` సినిమా షూటింగ్ సమయంలోనే ప్రారంభమైంది. అయితే అన్నా ఆ సినిమాలో నటిగా కాకుండా ప్రొడక్షన్ విభాగంలో సేవలందించారు. ఆ పరిచయం కాస్తా వివాహ బంధానికి దారితీసింది. దీంతో  2013లో  పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంప‌తుల‌కు కుమార్తె పొలెనా అంజనా, కుమారుడు మార్క్ శంకర్ ఉన్నారు.  పవన్ రాజకీయ ప్రయాణంలోనూ అన్నా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఏళ్ల నాటి తప్పుడు ప్రచారానికి అన్నా లెజ్నివా చెక్ పెట్టడం చ‌ర్చ‌కొచ్చింది.

Anna Lezhneva clears viral photo confusion:

Anna Clarifies Lady in 2011 Photo With Pawan Kalyan Is Not Her
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs