Advertisement
Google Ads BL

మెగాస్టార్ పై లుక్ టెస్ట్ ఇంట్రెస్టింగ్!


సాధారణంగా సినిమాల్లో కొత్త హీరోలకో లేదా ప్రయోగాత్మక చిత్రాలకో లుక్ టెస్ట్ చేయడం  చూస్తుంటాం. కానీ దశాబ్దాల అనుభవం, వందలాది పాత్రలు పోషించిన మెగాస్టార్ చిరంజీవి వంటి లెజెండరీ నటుడిపై కూడా దర్శకుడు బాబీ లుక్ టెస్ట్ నిర్వహించడం  సినీ వర్గాల్లో  ఆసక్తికరంగా మారింది. ఒక స్టార్ హీరో తన ఇమేజ్‌ను పక్కన పెట్టి దర్శకుడి విజన్‌కు అనుగుణంగా తనను తాను మలచుకోవడానికి సిద్ధపడటం ఆయనలోని అంకితభావానికి నిదర్శనం. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన `వాల్తేరు వీరయ్య` బ్లాక్ బస్టర్ కావడంతో ఈ కొత్త ప్రాజెక్ట్ (మెగా 158) పై అంచనాలు అమాంతం పెరిగాయి.

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర రెండు విభిన్న కోణాల్లో  సాగుతుండ‌టం విశేషం. ఒక వైపు తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఎమోషనల్ లుక్, మరోవైపు గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ మాస్ లుక్ ఉండబోతున్నాయని సమాచారం. ఈ రెండు వైవిధ్యమైన షేడ్స్ మధ్య వ్యత్యాసాన్ని పక్కాగా చూపించడం కోసమే బాబీ ప్రత్యేకంగా ఈ లుక్ టెస్ట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. `వాల్తేరు వీరయ్య`లో వింటేజ్ చిరంజీవిని చూపించిన బాబీ ఈసారి అంతకు మించి ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నారని మెగా అభిమానులు సంబరపడుతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో కంటెంట్ -క్యారెక్టరైజేషన్‌కు ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే చిరంజీవి వంటి సీనియర్ హీరోలు కూడా పాత్రలోని లోతును పట్టుకోవడం కోసం ఇటువంటి ప్రక్రియలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం మేకప్ మాత్రమే కాకుండా బాడీ లాంగ్వేజ్ , కాస్ట్యూమ్స్ పరంగా ఈ చిత్రంలో చిరంజీవి సరికొత్తగా కనిపించబోతున్నారని స‌మాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది.

Megastar Chiranjeevi:

Megastar Chiranjeevi -Bobby Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs