Advertisement
Google Ads BL

NTRNeel సినిమా వల్ల నష్టపోయిన రుక్మిణి


యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ విషయంలో చాలా గందరగోళం నెలకొంది. ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్నా డ్రాగన్ మూవీకి సంబందించిన అప్ డేట్ కానీ టైటిల్ కానీ ఇవ్వట్లేదు. అదలా ఉంటే డ్రాగన్ లో నటిస్తున్న హీరోయిన్, ఇంకా విలన్ మిగతా నటుల డేట్స్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. 

Advertisement
CJ Advs

అలా ఎప్పుడు బడితే అప్పుడు డేట్స్ కేటాయించలేను అంటూ మలయాళ స్టార్ తోవినో థమన్ #NTRNeel ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆయన ఎన్టీఆర్ కి విలన్ గా నటించాల్సి ఉంది. ఇక క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా డ్రాగన్ మూవీ వలన ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని చేజార్చుకుంది అనే వార్త వైరల్ అవుతుంది.

తమిళనాట ధనుష్ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపిక కాగా.. ఎన్టీఆర్ సినిమా వల్ల డేట్స్ డిస్టర్బ్ అవడంతో ఇప్పుడు ఆమె ప్లేస్ ని ధురంధర్ గర్ల్ సారా అర్జున్ చేజిక్కించుకుంది అంటున్నారు. ధురంధర్ 2 తో క్రేజ్ సంపాదించుకున్న సారా ను ధనుష్ చిత్రం కోసం సంప్రదిస్తున్నారట. సో రుక్మిణి ప్లేస్ లోకి ధనుష్ సరసన సారా వస్తుందన్నమాట.

మరి ఒక్క ఎన్టీఆర్-నీల్ సినిమా వల్లే ఇంత గందరగోళం జరుగుతుంది. ఇప్పటికే #NTRNeel ప్రాజెక్ట్ నుంచి ముందు అనుకున్న నటులు తప్పుకుంటున్నారు. 

Sara Arjun to replace Rukmini Vasanth in a biggie:

Dhanush next - Rukmini Vasanth out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs