Advertisement
Google Ads BL

పవన్ కి కేరింగ్ మరీ ఎక్కువైంది


రాజకీయాల్లోకి వెళ్ళాక తన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ ని నమ్ముకుని వరసగా రీమేక్స్ ని, అలాగే స్ట్రయిట్ సినిమాలను చేసేసిన పవన్ కళ్యాణ్ కి ఆ సక్సెస్ అనేది అనుకున్నంతగా రావట్లేదు. పవన్ స్టామినాకు తగిన హిట్టు దొరకడం లేదు. ఆ విషయంలో దర్శకులది ఎంత తప్పు ఉందొ అంతకు మించి పవన్ కళ్యాణ్ తప్పు కూడా ఉంది.

Advertisement
CJ Advs

తనకు సమయం ఉన్నప్పుడు డేట్స్ ఇవ్వడం, ఆ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకులు హడావిడిగా షూటింగ్ చక్కబెట్టేయడం వంటి విషయాలు పవన్ కళ్యాణ్ కెరీర్ కి ఫెయిల్యూర్ గా మారాయి. గత ఏడాది విడుదలైన OG హిట్ అన్నా నిర్మాతలకు నష్టాలొచ్చాయి. వీరమల్లు గురించి చెప్పక్కర్లేదు. ఇక ఉస్తాద్ విషయము అంతే.

మరి పవన్ కళ్యాణ్ తన తదుపరి ప్రాజెక్ట్స్ పై కావాల్సినంత ఫోకస్ పెట్టి సమయాన్ని వెచ్చిస్తేనే నిర్మాతలకు లాభాలొస్తాయి. అందుకే పవన్ ఈసారి తన తదుపరి సినిమా సురేందర్ రెడ్డి తో చెయ్యబోయే సినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నారట. అందుకోసం సురేందర్ రెడ్డి వాళ్ళు అమరావతిలోని ఆఫీస్ తీసి స్క్రిప్ట్ పనులు చేస్తున్నారట.

పవన్ కళ్యాణ్ వీలున్నప్పుడల్లా సురేందర్ రెడ్డి టీమ్ ని కలుస్తున్నారని, ప‌వ‌న్ ఏ లుక్ లో క‌నిపించాలి, ఆయ‌న స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండాలి అనే విషయం పై పవన్ తో టీమ్ డిస్కర్స్ చేస్తున్నారట. ఇక సురేందర్ రెడ్డి చిత్రం కోసమే ప‌వ‌న్ ఇప్పుడు గ‌డ్డం పెంచుతున్నారు. స్క్రిప్టు ప‌క్కాగా వ‌చ్చి, అన్ని విష‌యాలూ లాక్ చేసుకొన్న త‌ర‌వాతే సినిమాని మొదలు పెట్టె ఆలోచనలో పవన్ ఉన్నారట.

Pawan Kalyan:

Pawan Kalyan - Surender Reddy Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs