Advertisement
Google Ads BL

1000 కోట్లతో రామాయ‌ణం నిర్మాత ప్ర‌యోగం


భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం `రామాయణం`ను సుమారు 4000 కోట్లతో నిర్మిస్తున్న నిర్మాత నమిత్ మల్హోత్రా ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపుతున్నారు. రణబీర్ కపూర్ - అయాన్ ముఖర్జీ కాంబినేషన్‌లో వచ్చిన `బ్రహ్మాస్త్ర` సీక్వెల్ కోసం ఆయన దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించబోతున్నట్లు సమాచారం. 

Advertisement
CJ Advs

మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో నిరుత్సాహ‌ప‌ర‌చినా.. అందులోని విజువల్ ఎఫెక్ట్స్ `అస్ట్రావ‌ర్స్` కాన్సెప్ట్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ను మళ్ళీ పట్టాలెక్కించడానికి నమిత్ సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వీఎఫ్ఎక్స్ (VFX) రంగంలో అగ్రగామిగా ఉన్న ఆయన సంస్థ DNEG సహకారంతో ఈ సీక్వెల్‌ను హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు.

రణబీర్ కపూర్ `రామాయణం`పై ఉన్న అంచనాల వల్ల అత‌డి మార్కెట్ వాల్యూ భారీగా పెరిగింది. ఇదే సమయంలో అయాన్ ముఖర్జీ కూడా `బ్రహ్మాస్త్ర 2` కథపై భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండో భాగంలో శివ పాత్రకు తోడుగా `దేవ్` అనే కీలక పాత్రపైనే ఎక్కువ ఫోకస్ ఉండబోతోందని.. ఇందుకోసం ఒక అగ్ర హీరోను ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 

1000 కోట్ల భారీ వ్యయంతో రూపొందే ఈ చిత్రం భారతీయ సినిమాలో సరికొత్త రికార్డులను సృష్టించడమే కాకుండా.. అస్త్రవర్స్ ప్రపంచాన్ని మరింత విస్తృతం చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Ramayana Producers:

Ramayana Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs