తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీట్ లో ఉన్న సమయంలో ఈ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చెయ్యబోతున్న TVK నేత విజయ్ నటించిన చివరి సినిమా కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. నిన్నటివరకు సినిమా రిలీజ్ విషయంలో నెలకొన్న సమస్యలు చాలవన్నట్టు ఇప్పుడు సినిమా లీకులు నిర్మాతలను నట్టేట ముంచేసాయి.
జన నాయగన్ కీలక సన్నివేశాల లీకులు సెన్సేషన్ క్రియేట్ చెయ్యగా ఈకేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే సమయంలో జన నాయగన్ చిత్రం కోయంబత్తూరు లోని కొన్ని లోకల్ ఛానల్స్ లో సినిమా సినిమానే ప్లే అవడం షాకిచ్చింది.
ఏప్రిల్ 11న కోయంబత్తూర్లోని కొన్ని ప్రాంతాల్లోని లోకల్ ఛానల్స్ లో జన నాయగన్ సినిమాను ప్రదర్శించారు. అది చూసిన TVK నేతలు, కార్యకర్తలు చిత్ర ప్రసారాన్ని నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఛానల్ యాజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.