దేవర తో సౌత్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ పాప ఇప్పుడు పెద్ది తో మరోమారు సౌత్ నుంచి నార్త్ ఆడియన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యింది. పెద్ది చిత్రంతో అమ్మడు ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా జాన్వీ కపూర్ సక్సెస్ ని కోరుకునేవారు.
పెద్ది ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ అయ్యి జూన్ కి వెళ్లబోతుంది అనే ప్రచారం ఉండగా.. జాన్వీ కపూర్ సోషల్ మీడియా ఫొటోస్ మాత్రం యూత్ ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. తాజాగా ఏంజిల్ లుక్ లో అంటే వైట్ కాస్ట్యూమ్ లో జాన్వీ కపూర్ చాలా బ్యూటిఫుల్ లుక్ లో కనిపించి కనువిందు చేసింది.
మోడ్రెన్ లుక్, అందుకు తగిన గ్లామర్, అంతకుమించిన అందంతో జాన్వీ కపూర్ లేటెస్ట్ లుక్ మాత్రం అద్దిరిపోయింది. మీరు కూడా జాన్వీ కపూర్ వైట్ కాస్ట్యూమ్ లో ఏంజిల్ లా ఎంతెలా మెరిసిపోతుందో మీరు ఓ లుక్కెయ్యండి.