Advertisement
Google Ads BL

మృణాల్ ఠాకూర్ మోడ్ర‌న్ మధుబాల!


 

Advertisement
CJ Advs

స్టార్ డైరెక్ట‌ర్  నాగ్ అశ్విన్  నటి మృణాల్ ఠాకూర్ పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె నటన , ఆహార్యాన్ని చూ స్తుంటే అలనాటి దిగ్గజ నటి మధుబాల గుర్తుకొస్తుంద‌ని  కొనియాడారు. మృణాల్‌లో ఉన్న సహజమైన అందం, క్లాసిక్ లుక్ ఆమెను ఇతర హీరోయిన్ల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుందని అభిప్రాయపడ్డారు.

అలాగే ఓ విలువైన సలహా కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ , ప్రతిభకు తగ్గట్టుగా మరింత మెరుగైన, సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకోవాలని  కోరారు. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా తనలోని నటనను కొత్త కోణంలో ఆవిష్కరించే కథలపై దృష్టి పెట్టాలని సూచించారు.  `డెకాయిట్` వంటి విభిన్నమైన ప్రాజెక్టు ద్వారా ఆమె తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లగలదని  ఆశాభావం వ్యక్తం చేశారు.

మృణాల్ ఠాకూర్ ఇప్పటికే `సీతా రామం` తో  తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. నాగ్ అశ్విన్ వంటి విజనరీ దర్శకుడు ఆమెను మధుబాలతో పోల్చడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రశంసలు ఆమెకు మరిన్ని గొప్ప అవకాశాలను తెచ్చిపెడతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Mrunal Thakur:

Mrunal Thakur-Madhubala
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs