Advertisement
Google Ads BL

కాక పుట్టిస్తోన్న యంగ్ టైగ‌ర్ మస్కులర్ లుక్!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం `డ్రాగన్` నుండి  అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ సిద్ధం చేసిన సరికొత్త మస్కులర్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.  తారక్ ఈ సినిమా కోసం తన శరీరాకృతిని పూర్తి స్థాయిలో మార్చుకున్నట్లు తెలుస్తోంది. గత చిత్రాల కంటే భిన్నంగా, అత్యంత పవర్‌ఫుల్ , స్టైలిష్ అవతార్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు.

Advertisement
CJ Advs

ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే; ఆయన తన హీరోలను వెండితెరపై ఒక బీస్ట్  లా చూపిస్తారు. `డ్రాగన్` చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత కరుడుగట్టిన యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొనాల్సి ఉన్నందున ఆయన  శారీరక మార్పుకు శ్రీకారం చుట్టారు. ఈ లుక్ కోసం తారక్ కఠినమైన శిక్షణతో పాటు ప్రత్యేకమైన డైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లుక్ చూస్తుంటేనే సినిమా ఎంతటి భారీ యాక్షన్ విజువల్ వండర్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్  చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉండగా తాజా మస్కులర్ లుక్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఎన్టీఆర్ తన కెరీర్‌లో అత్యంత ఫిట్‌గా కనిపించే సినిమాల్లో డ్రాగన్ అగ్రస్థానంలో నిలవనుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు

Jr NTR New Look Viral:

Jr NTR latest look go viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs