కోలీవుడ్ లో నయనతార భర్త విగ్నేష్ శివన్ తెరకెక్కించిన LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం ఎన్నో అడ్డంకులు దాటుకుని, ఎన్నో వాయిదాలు వేసుకుంటూ చివరికి ఏప్రిల్ 10 న ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ LIK చిత్రానికి తమిళనాట మిక్స్డ్ టాక్ కనిపించినప్పటికీ తెలుగులో మాత్రం ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది.
హ్యాట్రిక్ హిట్స్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాథన్ కి LIK బ్రేకులు వేసింది. హీరోయిన్ కృతి శెట్టి కు ప్లాప్ లు కంటిన్యూ అయ్యాయి. అయితే ఈ చిత్రం ప్లాప్ అవడం వలన హీరో ఇమేజ్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అంటే ప్రదీప్ రంగనాథన్ ని LIK రిజల్ట్ వలన ఎవరూ బ్లేమ్ చెయ్యడం లేదు.
కారణం LIK చిత్రానికి ఎలాంటి క్రేజ్ లేకుండా, హైప్ లుకుండా విడుదల చేసిన దర్శకుడు విగ్నేష్ శివన్ ని అటు కోలీవుడ్ మీడియా ఇటు టాలీవుడ్ మీడియా ఎత్తి చూపిస్తుంది. జీరో హైప్ తో LIK విడుదల కావడానికి దర్శకుడే కారణమంటున్నారు. హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రమోషన్స్ లో చాలా హెల్ప్ అయ్యాడు.
కానీ విగ్నేష్ శివన్ LIK ప్రమోషన్స్ లో కనిపించలేదు, అందుకే సినిమాపై ఎవ్వరిలో ఆసక్తి కనిపించలేదు. ఇక బాక్సాఫీసు దగ్గర ప్లాప్ టాక్ తెచ్చుకోవడం అన్ని విగ్నేష్ వల్లే అంటూ మాట్లాడుకుంటున్నారు.