యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ `డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) విలన్ పాత్రపై కొత్త అప్ డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో తారక్‌ను ఢీకొట్టే అత్యంత శక్తివంతమైన ప్రతి నాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో షాహిద్ వంటి నటుడు తోడైతే బాక్సాఫీస్ వద్ద అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం.
నిజానికి ఈ పాత్ర కోసం తొలుత మలయాళ స్టార్ నటుడు తోవినో థామస్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే కాల్ షీట్ల సమస్యల కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ప్రశాంత్ నీల్ బాలీవుడ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో విలన్ పాత్రలు హీరోలకు ధీటుగా ఎంతో గంభీరంగా ఉంటాయి. `కబీర్ సింగ్` వంటి చిత్రాలతో తనలోని తీవ్రమైన నటనను నిరూపించుకున్న షాహిద్, ఎన్టీఆర్ మాస్ పవర్‌ను ఎదుర్కొనే విలన్‌గా సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారుట.
ప్రస్తుతం ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఒకవేళ షాహిద్ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది ఆయనకు నేరుగా టాలీవుడ్ అరంగేట్రం అవుతుంది. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. ఉత్తరాది మార్కెట్‌లో కూడా సినిమాకు బలమైన క్రేజ్ రావాలంటే షాహిద్ వంటి స్టార్‌ను తీసుకోవడం వ్యూహాత్మకంగా కూడా కలిసి వచ్చే అంశం. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.