టాలీవుడ్‌లో `సీతారామం` వంటి చిత్రాలతో హోమ్లీ బ్యూటీగా, క్లాసిక్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మృణాల్ ఠాకూర్‌ను భవిష్యత్తులో అత్యంత క్రూరమైన పాత్రలో నటించనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ విషయాన్ని వెల్లడించారు. మృణాల్ కోసం తన వద్ద ఒక అసాధారణమైన -క్రేజీ ఐడియా ఉందని, ఆమెలోని నటనను మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత ఇంటెన్స్ కోణంలో ఆవిష్కరించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటివరకు సున్నితమైన భావోద్వేగాలతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. అనురాగ్ మార్క్ డార్క్ ఫిలిం మేకింగ్‌లో ఒక పవర్‌ఫుల్ అగ్రెసివ్ రోల్‌లో ఎలా కనిపిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అభిమానులు మృణాల్ తన ఇమేజ్‌ను బ్రేక్ చేస్తూ ఇలాంటి బో*ల్డ్ ప్రయోగాలు చేయడం మంచిదని అంటుంటే...మరికొందరు మాత్రం అనురాగ్ కశ్యప్ తన డార్క్ స్టోరీలతో మృణాల్ కెరీర్‌ను రిస్క్‌లో పడేస్తున్నారంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె సాఫ్ట్ ఇమేజ్‌కు అలవాటు పడిన ప్రేక్షకులు ఈ `బ్రూటల్` మేకోవర్‌ను అంగీకరిస్తారా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా, మృణాల్ తనలోని నటిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇలాంటి సవాలుతో కూడిన పాత్రలను ఎంచుకోవడం ఒక సాహసోపేతమైన అడుగు అనే చెప్పాలి. అడివిశేష్ - మృణాల్ జంటగా నటించిన డెకాయిట్ ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే.