రిలీజ్ డేట్ కావాలి కానీ ఫస్ట్ సింగిల్ మాకెందుకు అంటున్నారు నిఖిల్ సిద్దార్థ్ ఫ్యాన్స్. స్వయంభు మేకర్స్ స్వయంభు విడుదల తేదీని పెండింగ్ లో పెట్టి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఏదో నార్మల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో లో విడుదలైతే ఓకే. కానీ పాన్ ఇండియా మూవీ గా స్వయంభు ని అనౌన్స్ చేసి ఇలా విడుదల తేదీ విషయంలో మల్లగుల్లాలు పడడమే ఫ్యాన్స్ కి నచ్చడం లేదు.
స్వయంభు సీజీ వర్క్ పూర్తి కాకుండానే ఏప్రిల్ రిలీజ్ అని ఎలా అన్నారు, ఆ ఏప్రిల్ వెళ్లిపోతుంది, మే రావడానికి సరిగ్గా 15 రోజులుంది. ఇప్పటికి విడుదల తేదీ విషయం తేల్చకుండా ఫిస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నామంటూ మేకర్స్ హడావిడి. అదే విషయంలో ఫ్యాన్స్ గురుగా ఉన్నారు.
నిఖిల్ కూడా నిర్మాతలకు సహకరిస్తూ స్వయంభు రిలీజ్ తేదీ రాకుండానే సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. మరి మే 22 కి స్వయంభు రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. ఆ డేట్ అఫీషియల్ గా ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో చూడాలి.