యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ యాక్షన్ ప్యాకెడ్ పాన్ ఇండియా ఫిలిం డ్రాగన్ చిత్రం షూటింగ్ విశేషాలు, ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అన్ని మే 19 కి అంటే ఎన్టీఆర్ బర్త్ డే కి ఒక రోజు ముందే స్పెషల్ గా వదిలేందుకు డ్రాగన్ టీమ్ రెడీ అవుతుంది.
అయితే రీసెంట్ గా ఈ చిత్రం నుంచి ఎన్టీఆర్ ని ఢీ కొట్టబోయే విలన్ మలయాళ హీరో తోవినో థామస్ తప్పుకున్నారు. తను ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వలేను, అందుకే ఎన్టీఆర్-నీల్ మూవీ నుంచి తప్పుకున్నట్టుగా చెప్పారు. దానితో ఎన్టీఆర్-నీల్ మూవీలో ఎన్టీఆర్ ని ఢీ కొట్టబోయే విలన్ ఎవరో అనే విషయంలో ఎడతెగని ఉత్కంఠ మొదలయ్యింది.
తాజాగా డ్రాగన్ చిత్రంలో ఎన్టీఆర్ ని ఢీ కొట్టబోయే విలన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సలార్ కోసం పృథ్వీరాజ్ ని తీసుకొచ్చినట్టుగా ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ని ఒప్పించే ప్లాన్ లో ఉన్నారట. దానితో ఎన్టీఆర్ - షాహిద్ కపూర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంతేకాకుండా ఎన్టీఆర్-నీల్ మూవీలో ధురంధర్ 2 లో అడ్డరగొట్టిన బాలీవుడ్ నటుడు బిమల్ ఒబెరాయ్ నెగెటివ్ పాత్రలో కనిస్తాడని టాక్ వినిపిస్తోంది.