Advertisement
Google Ads BL

తాయ్ కిళవి మినీ రివ్యూ


కోలీవుడ్ లో దాదాపుగా రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి థియేటర్స్ లో రూ.75 కోట్లు కలెక్ట్ చేసిన తాయ్ కిళవి చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. స్టార్ నటి రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కిన తాయ్ కిళవి చిత్రం కోలీవుడ్ నుంచి అన్ని భాషల్లోనూ పాపులర్ అయ్యింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ పాత్రపై జరిగిన చర్చ ఈ చిత్రం పై అందరిలో క్యూరియాసిటీ పెరిగేలా చేసింది ఇప్పుడు ఈ చిత్రం జియో ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

Advertisement
CJ Advs

తాయ్ కిళవి షార్ట్ స్టోరీ: 

భర్త చనిపోయిన ఒక మహిళ ఎవరి సహాయం లేకుండా సమాజంలో బ్రతకడం ఎంత కష్టమో.. కానీ తెలివి తేటలతో ఆ కష్టాన్ని అధిగమించి వడ్డీ వ్యాపారంతో తనకి తాను నిర్మించుకున్న సామ్రాజ్యంలోకి మోసపూరితమైన కొడుకులను చేరనివ్వకుండా ఒంటరి మహిళ చేసిన పోరాటమే ఈ తాయ్ కిళవి షార్ట్ స్టోరీ.  

తాయ్ కిళవి ఎఫర్ట్స్: 

పవునుతాయి పాత్ర ఈ చిత్రానికి మెయిన్ హైలెట్. రాధికా శరత్ కుమార్ ఈ  పాత్ర దాని తాలూకు ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఎంత గొప్పగా చెప్పారో.. అందుకు తగిన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని అద్భుతమే. పవునుతాయి కొడుకులు, కోడళ్ళు, కుమార్తె గా నటించిన ప్రతి ఒక్క పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. దర్శకుడు ప్రతి పాత్రను వారి బలహీనతలు కామెడీ టచ్ ఇస్తూ ఈ కథను వినోదభరితంగా తీర్చిదిద్దారు.

తాయ్ కిళవి స్క్రీన్ ప్లే: 

మనిషి బ్రతకడానికీ .. ఆ మనిషిని బ్రతికించడానికి కూడా డబ్బే అవసరం. డబ్బులేనివాడికి ఈ సమాజంలో ఎలాంటి గౌరవం ఉండదు అనే చక్కటి సోషల్ మెసేజ్ ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. 

ఓ చిన్న పల్లెటూరు లో పవునుతాయి అనే భర్త లేని మహిళ ఊరి ప్రజలకు అప్పులు ఇస్తూ వారితో తిట్లు తింటూ కూతురు, మనవడితో కలిసి బ్రతుకుతుంది. ఆమె దగ్గర నుంచి అప్పు తీసుకున్న వాళ్ళు, చివరికి కన్న కొడుకు, వచ్చిన కోడళ్ళు ఆమె చనిపోవాలని కోరుకుంటారు. కానీ బంగారం కోసం ఆమెను బ్రతికించుకోవాలని కొడుకులు - కోడళ్లు తపనపడతారు.. సినిమా అంతా బంగారం చుట్టూ తిరిగినా దానికి కామెడీ టచ్ ఇచ్చిన తీరు, సోషల్ మెసేజ్ ఆకట్టుకుంటాయి.

సాంకేతికంగా.. నివాస్ కె ప్రసన్న నేపథ్య సంగీతం, వివేక్ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ, సాన్ లోకేశ్ ఎడిటింగ్, కతాకు సరిపోయే ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయని చెప్పొచ్చు.   

తాయ్ కిళవి ఎనాలసిస్: 

ఈ ప్రపంచంలో బంధాలకు అస్సలు విలువ లేదు. కేవలం డబ్బు తోనే బంధాలు, అనుబంధాలు ముడి పడి ఉన్నాయి. అమ్మాయిలు నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుని, తెలివిగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే ధైర్యంగా బ్రతికి చూపించేలా రాధికా శరత్ కుమార్ పాత్ర పవునుతాయి తో ఇచ్చిన మెసేజ్ నిజంగా ఆడవాళ్లకు బాగా కనెక్ట్ అవుతుంది. తాయ్ కిళవి చిత్రంలో తల్లి కొడుకుల అనుబంధమే కాదు, వారి మద్యన ఉన్న డబ్బు అనే అడ్డు గోడను కూడా పశ్చాత్తాపంతో పగలగొట్టగలదని చూపించారు. తాయ్ కిళవి ఇది ఓటీటీ లో కచ్చితంగా వీక్షించాల్సిన చిత్రం. మరి లేట్ ఎందుకు మీరు ఈ చిత్రాన్ని జియో హాట్ స్టార్ లో చూసెయ్యండి. 

Thaai Kelavi Mini review:

Thaai Kizhavi Mini Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs