మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తర్వాత దర్శకుడు బాబీ తో మెగా 158 చిత్రాన్ని లాంచ్ చెయ్యబోతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మెగా 158 చిత్రం అసలైతే ఈరోజు ఏప్రిల్ 11 న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో మొదలు కావాల్సి ఉంది.
కానీ సడెన్ గా మెగా 158 పూజా కార్యక్రమాలు పోస్ట్ పోన్ అవడంతో మెగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అయితే మెగా 158 పూజా కార్యక్రమాలు వాయిదా పడడానికి కారణం కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ సమస్యల్లో ఉండడంతో మెగాస్టార్ స్టార్ ప్రాజెక్ట్ మొదలు కాలేదు. తమిళనాట KVN ప్రొడక్షన్ నిర్మించిన జన నాయగన్ చిత్రం లీకైంది.
ఈ విషయంలో నిర్మాతలు ఇబందుల్లో ఉన్న కారణముగా మెగాస్టార్ చిరు మెగా 158 చిత్ర పూజ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.