Advertisement
Google Ads BL

ర‌ష్మిక క్యూట్ చెల్లెలికి టాలీవుడ్ వెల్‌కమ్


ప్రపంచవ్యాప్తంగా సిబ్లింగ్స్ డే డీసెంట్ గా జ‌రుగుతోంది. ఈ శుభ సంద‌ర్భంగా ర‌ష్మిక మందన్న తన చిన్నారి సోదరి శిమన్ మందన్నతో దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఫోటోలో రష్మిక పక్కన ఉన్న శిమన్ తన క్యూట్ లుక్స్‌తో నెటిజన్లను కట్టిపడేస్తోంది. రష్మిక కంటే శిమన్ సుమారు 16 ఏళ్లు చిన్నది కావడం గమనార్హం. ప్రస్తుతం 14 ఏళ్ల ప్రాయంలో ఉన్న శిమన్ తన సోదరి రష్మిక - విజయ్ దేవరకొండల వివాహ వేడుకలో కూడా సందడి చేస్తూ కెమెరా కళ్లకు చిక్కింది. గ్లామర్ ప్రపంచంలో బిజీగా ఉన్నా రష్మిక తన సోదరితో గడిపే ప్రతి క్షణాన్ని ఎంతో గౌరవిస్తారని ఈ పోస్ట్ ద్వారా మరోసారి అర్థమవుతోంది.

Advertisement
CJ Advs

శిమన్ మందన్న అందచందాలను చూస్తుంటే.. ఈ బ్యూటీ భవిష్యత్తులో కథానాయికగా ఎదిగేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. టీనేజ్ దశలో ఉన్న శిమన్ ప్రస్తుతం తన విద్యాభ్యాసంపైనే పూర్తి దృష్టి సారించినా.. రష్మిక వారసురాలిగా వెండితెరకు పరిచయమైతే త‌న‌కు రెడ్ కార్పెట్ వేయడానికి చిత్ర పరిశ్రమ సిద్ధంగా ఉందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. 

అయితే శిమన్‌కు నటనపై ఆసక్తి ఉందా లేదా అన్నది త‌న‌ కుటుంబ సభ్యులు ఇంకా వెల్లడించలేదు. ఒకవేళ శిమ‌న్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడితే మంద‌న్న సిస్ట‌ర్స్ ఇద్ద‌రూ కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

Rashmika Mandanna wishes sister Shiman:

Rashmika Mandanna Treats Fans To Sweet Siblings Day
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs