బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రస్తుతం ధురంధర్ ద రివెంజ్ సక్సెస్ చేసే మూడ్ లో ఉంటే ఆయన్ని కోర్టు కేసు వెంటాడుతుంది. అది కన్నడ సెన్సేషనల్ మూవీ కాంతార 1 చిత్రంలో రిషబ్ శెట్టి పోషించిన పాత్రను ఇమిటేట్ చేస్తూ దైవాన్ని కంచపరిచేలా రణ్వీర్ సింగ్ ఓ సినీ వేదికపై చేసిన విన్యాసాలపై ఆయనపై విమర్శలు వెల్లువెత్తేలా చేసాయి.
అంతేకాకుండా ఓ న్యాయవాది రణ్వీర్ సింగ్ పై ఫిర్యాదు చేయగా ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రణ్వీర్ బహిరంగ క్షమాణాలు చెబుతూ.. ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు రణ్వీర్ ధురంధర్ 2 రిలీజ్ తర్వాత క్షమించమని కోరుతూ అందుకు సంబందించిన గుడికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తాను అని రణ్వీర్ పేర్కొన్నారు.
అదే విషయాన్ని రణ్వీర్ సింగ్ న్యాయవాది సజన్ పూవయ్య వాదనలు వినిపిస్తూ, ఇప్పటికే కోర్టులో క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేశామని, సంబంధిత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తానని కూడా అందులో పేర్కొన్నామని తెలిపారు. కానీ సదరు న్యాయవాది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అఫిడవిట్‌లో నిజమైన పశ్చాత్తాపం కనిపించడం లేదని వాదించారు. మరింత నిర్దిష్టమైన, స్పష్టమైన క్షమాపణ కావాలని కోరారు.
దానితో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఫిర్యాదుదారుకు సంతృప్తి కలిగించేలా సవరించిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.