ఏప్రిల్ 5 నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్ డే. ఈ బర్త్ డే రష్మిక కు చాలా స్పెషల్. కారణం తన లైఫ్ లోకి ఈ ఏడాది విజయ్ దేవరకొండ రావడం, అంగరంగ వైభవంగా వారి వివాహం జరగడం, అలాగే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా టాప్ చైర్ కి దగ్గర కావడం అన్ని ఆమెకు చాలా స్పెషల్. అంతకు మించి స్పెషల్ గిఫ్ట్ ని రష్మిక తండ్రి తన కుమార్తెకు అందించాడు.
ఈఏడాది తన బర్త్ డే ని ఫ్యామిలీ మెంబెర్స్ తో జరుపుకున్న రష్మిక తను సొంత ఊరైన కర్ణాటకలోని విరాజ్‌పేటను సందర్శించడం అన్ని ఎంతో ప్రత్యేక కాగా.. రష్మిక పుట్టిన రోజునాడు ఆమె తండ్రి మదన్ మందన్న ఆమెకు ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. విరాజ్‌పేట సమీపంలో సెరినిటీ అనే విలాసవంతమైన బంగ్లాను రష్మిక కు బహుమతిగా అందించారు.
రష్మిక కు ఆమె తండ్రి అందించిన పేపర్స్ ని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయిన రష్మిక ఈసారి నా 30వ పుట్టినరోజు చాలా భిన్నంగా, ప్రత్యేకంగా సాగింది, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, తాను చదువుకున్న స్కూల్‌ను సందర్శించడం, పెళ్లికి రాలేకపోయిన బంధువులతో కలిసి విందులో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అంటూ సంతోషంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.