Advertisement
Google Ads BL

హిట్ హీరో కి ప్రెస్ షో కూడా లేదా


హ్యాట్రిక్ హిట్స్ తో జోష్ లో ఉన్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన చిత్రానికి కనీసం మేకర్స్ ప్రెస్ షో కూడా వేయకపోవడం గమనార్హం. టాలీవుడ్ నిర్మాతలు మీడియా పీపుల్ కోసం ముందు రోజే ప్రీమియర్స్ వేస్తున్న ఈ రోజుల్లో హిట్ హీరో ప్రదీప్ రంగనాథన్  సినిమాకి కనీసం విడుదలైన రోజు కూడా మీడియా పీపుల్ కి షో వెయ్యకపోవడమేమిటో..

Advertisement
CJ Advs

తమిళనాట విగ్నేష్ శివన్ తెరకెక్కించిన LIK లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ చిత్రం పలు సమస్యలు అంటే చాలాసార్లు విడుదల వాయిదాలతో ఎట్టకేలకు నేడు ఏప్రిల్ 10 న థియేటర్స్ లో విడుదలయ్యింది. ప్రదీప్ రంగనాథన్ - హీరోయిన్ కృతి శెట్టి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాని ప్రమోట్ చేసారు. కెరీర్ ఆరంభం నుంచే కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవగా, ప్రదీప్ రంగనాథన్ నటించిన మూడు చిత్రాలు లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ తెలుగు లో విడుదలై హిట్ అయ్యాయి.

ఇప్పుడు LIK చిత్రాన్ని కూడా తెలుగులో బాగానే ప్రమోట్ చేసారు. మరి ఏప్రిల్ 10 న LIK ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలు ప్రెస్ షో వేయకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.  నేరుగా ప్రేక్షకులల్తో సినిమాని వీక్షించి రివ్యూస్ రాయాలని కోరుకున్నారో, లేదంటే మరేదన్నా సమస్యో తెలియడం లేదు. 

అయితే ఈరోజు ఉదయం LIK షోస్ క్యాన్సిల్ అయినట్లుగా  తెలుస్తుంది. అలాగే మీడియా పీపుల్ కి LIK షో వేయకపోవడం పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

LIK Releasing Today:

LIK movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs