Advertisement
Google Ads BL

నయనతార కోరిక తీరుతుందా..


లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినా అంటే భారీ బడ్జెట్ మూవీస్ అయినా, మీడియం రేంజ్ సినిమాలైనా ఎలాంటి సినిమా అయినా ప్రమోషన్స్ కి రాదు. అనిల్ రావిపూడి కష్టపడి ఏదో రెండు ప్రమోషనల్ వీడియోస్ చేయించాడు కానీ ఆమెను మీడియా ముందుకు తీసుకురాలేకపోయాడు.

Advertisement
CJ Advs

అయితే హీరోయిన్ గా తన సినిమా విడుదలకు ముందు ఎలాంటి టెన్షన్ పడని నయనతార ఇప్పుడు తన భర్త డైరెక్ట్ చేసిన LIK సినిమా రిలీస్ ముందు బాగా టెన్షన్ పడుతుంది. రిలీజ్ కి ఒక రోజు ముందే భర్త విగ్నేష్ శివన్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార భర్త విజయం సాధించాలని బలంగా కోరుకుంటుంది.

భర్త విగ్నేష్ శివన్ అజిత్ తో సినిమా అనుకున్నాక అది ఆగిపోయింది. ఆతర్వాత ప్రదీప్ రంగనాథన్ తో LIK మూవీ చేసాడు. ఆ చిత్రం ఎన్నోసార్లు వాయిదాలు పడి చివరికి ఈరోజు ఏప్రిల్ 10 న ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం హిట్ అయ్యి భర్త విగ్నేష్ శివన్ టాప్ డైరెక్టర్ అవ్వాలని నయన్ కోరిక.

అందుకే LIK సక్సెస్ కోసం ఆమె చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. మరి ఆమె సక్సెస్ అయితే సరిపోదు కదా భర్తను ఆ స్థాయిలో చూడాలని ప్రతి భార్య కోరుకున్నట్టే నయన్ కోరుకుంటుంది. 

Lady Superstar Nayanthara:

Actress Nayanthara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs