టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యంత కీలకమైన దశలో ఉన్నాడు. వరుస ప్లాపులతో కొంతకాలం మార్కెట్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా శ్రమించి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `నారీ నారీ నడుమ మురారి` చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించి గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా `బైకర్` అనే స్పోర్ట్స్ డ్రామాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాల సక్సెస్ ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాదు. బాక్సాఫీస్ వద్ద కోల్పోయిన తన మార్కెట్‌ను మళ్లీ పుంజుకునేలా చేశాయి.
ప్రస్తుతం శర్వానంద్ తదుపరి చిత్రం `భోగి` తో రెడీ అవుతున్నాడు. శర్వా సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో విజ యాలు అందుకున్నప్పటికీ ఇప్పటి వరకు వరుసగా మూడు హిట్లు కొట్టి అధికారిక హ్యాట్రిక్ సాధించిన సందర్భం లేదు. అందుకే `భోగి` చిత్రాన్ని ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తే శర్వా కెరీర్‌లో తొలి హ్యాట్రిక్ నమోదవుతుంది. కథలోని వైవిధ్యం, శర్వా మార్క్ నటన ఈ సినిమాను మరో మెట్టు ఎక్కిస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఈ సినిమా ఫలితం శర్వానంద్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా మార్చేసి టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోల జాబితాలో ఆయనను నిలబెట్టనుంది.
గతంలో ఎదురైన పరాజయాలు శర్వాకు జీవితం పట్ల పరిశ్రమ పట్ల కొత్త పాఠాలను నేర్పాయి. ముఖ్యంగా ఇండ స్ట్రీలో అతిగా ఎవరినీ నమ్మకూడదనే విషయాన్ని ఆయన గ్రహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంతో పరిణతితో ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటున్ననాడు. `భోగి` ప్రమోషన్ తెలివిగా ప్లాన్ చేస్తున్నాడు . ఒకప్పుడు ప్లాపుల వల్ల కుంగిపోయిన స్థితి నుంచి ఇప్పుడు వరుస హిట్లతో మళ్లీ పాత ఫామ్‌ను అందుకోవడం ఆయన పట్టుదలకు నిదర్శనం.