Advertisement
Google Ads BL

ఆ సినిమాను ఏకంగా డిసెంబ‌ర్ కే తొసేస్తున్నారా..


నేచుర‌ల్ స్టార్  నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న `ది ప్యారడైజ్` విడుదల తేదీపై ఫిల్మ్ నగర్‌లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నిజానికి ఈ సినిమాను మార్చి 26 న విడుదల చేయాలని మొదట భావించారు. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని చిత్రబృందం దీనిని ఇప్పటికే ఆగస్టు 21 కి వాయిదా వేసింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆగస్టు డెడ్‌లైన్ కూడా రీచ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోందంటున్నారు. దీంతో  సినిమా ఏకంగా డిసెంబర్‌కు వాయిదా  ప‌డే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

తాజా వాయిదా వార్తలకు ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికీ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందంటున్నారు. బ్యాలెన్స్ షూట్ ఆగ‌స్ట్ క‌ల్లా పూర్తి కావ‌డం క‌ష్ట‌మ‌ని వినిపిస్తోంది.  భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించాల్సి  ఉంది. అలాగే ఈ సినిమాకు సంగీతం అందిస్తోన్న‌ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ చేతిలో అనేక పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉండటం. ఆయన రీ-రికార్డింగ్  అవుట్‌పుట్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటారనే పేరుండటంతో ఆగస్టు నాటికి పనులు పూర్తి కావడం సందేహంగా మారింది.

అయితే ఈ వాయిదాపై చిత్ర నిర్మాణ సంస్థ నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. గత నెలలో మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బీటీఎస్ వీడియోలో కూడా ఆగస్టు 21 విడుదల తేదీనే మేకర్స్ ప్రస్తావించారు. కానీ ఒకవేళ ఆగస్టు మిస్ అయితే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ రేసులో ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దసరా వంటి హిట్ తర్వాత వ‌స్తోన్న‌ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.  అందుకే హడావిడిగా కాకుండా పక్కా అవుట్‌పుట్‌తో రావాలని నాని కూడా భావిస్తున్నట్లు సమాచారం.

The Paradise:

Nani The Paradise
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs